కొత్త జిల్లాల కలెక్టర్లు వీరే..

రేపు దసరా పండుగ. రేపే తెలంగాణా మళ్ళీ కొత్త జిల్లాలలో నూతన రూపంతో తనని తాను పునరవిష్కరించుకోబోతోంది. అందుకు ఉదయం 11.12 నిమిషాలు దివ్య ముహూర్తంగా నిర్ణయించారు పండితులు. కనుక అన్ని జిల్లాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలు ఆ సమయంలో ప్రారంభించబోతున్నారు. అప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనేక అధికారిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కొత్త జిల్లాలకి కలెక్టర్ల పేర్లని ఈరోజు సాయంత్రమే ప్రభుత్వం ప్రకటించింది.

వారి వివరాలు:  

యాదాద్రి జిల్లా-అనితా రామచంద్రన్; జోగులాంబ జిల్లా -రజత్ కుమార్; రాజన్న సిరిసిల్ల జిల్లా-కృష్ణ భాస్కర్;
జయశంకర్ జిల్లా –మురళి; వరంగల్ అర్బన్ జిల్లా-అమ్రపాలి; మహబుబాబాద్ జిల్లా- ప్రీతిమీనన్; మెదక్ జిల్లా- భారతి హోలికేరి;

జిగిత్యాల జిల్లా-శరత్; ఆదిలాబాద్ జిల్లా-జ్యోతి బుద్ధప్రసాద్; నిర్మల్ జిల్లా-ఇలంబర్తి,

ఆసిఫాబాద్ జిల్లా-చంపాలాల్, వనపర్తి జిల్లా-శ్వేతా మహంతి; నాగర్ కర్నూల్ జిల్లా- శ్రీధర్;

వికారాబాద్ జిల్లా-దివ్య; మల్కాజ్‑గిరి జిల్లా-ఎంవీ రెడ్డి; వరంగల్ రూరల్ జిల్లా-ప్రశాంత్;
సిద్ధిపేట జిల్లా-వెంకట్రామిరెడ్డి; సూర్యాపేట జిల్లా-సురేంద్ర మోహన్;

పెద్దపల్లి జిల్లా-అలుగు వర్షిణి; కామారెడ్డి జిల్లా-సత్యనారాయణ