భద్రాచలంలో ఆ హడావుడి ఏమిటో?

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకి మంత్రివర్గం నిన్న ఆమోదముద్ర వేసింది. నేడోరేపో దాని కోసం ఆర్డినెన్స్ జారీ చేయబోతోంది. దసరా రోజు నుంచే రాష్ట్రంలో 31 కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి. వాటి కోసం అధికారులు, కార్యాలయాలు, వగైరా ఏర్పాతలని కూడా ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తోంది. అయినప్పటికీ రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడ నిరసనలు, అదనపు జిల్లాల కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. 

గిరిజన ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న భద్రాచలన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, తెదేపా ఇన్-చార్జ్ కొమరం ఫణీశ్వరమ్మ వేర్వేరుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారిలో సున్నం రాజయ్య ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుండటంతో నిన్న అర్ధరాత్రి పోలీసులు వారి దీక్షలు భగ్నం చేసి స్థానిక ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్పించారు. తెదేపా, సిపిఎం నేతలు అందుకు నిరసన తెలియజేశారు. దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన తరువాత మెల్లగా ప్రతిపక్షాలు ఈ హడావుడి తగ్గుమొఖం పడుతుందేమో చూడాలి.