ఈసారి రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాజధాని హైదరాబాద్‌ నగరంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున ఈసారి గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కనుక రేపు (జనవరి 26) ఉదయం 7 గంటలకు రాజ్‌భవన్‌లో సిఎం కేసీఆర్‌, మంత్రులు, అధికారుల సమక్షంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జాతీయ జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. 

తమిళిసై సౌందరరాజన్‌ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నందున హైదరాబాద్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ముగియగానే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి చేరుకొని అక్కడ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న తరువాత మళ్ళీ హైదరాబాద్‌ తిరిగి వస్తారు.