భూదాన్ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి ప్రపంచ పర్యాటక సంస్థ (వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 గ్రామాలు, వాటిలో భారత్‌ నుంచి మూడు గ్రామాలు దీనికి పోటీ పడగా తెలంగాణలో భూదాన్ పోచంపల్లి ఈ అంతర్జాతీయ గుర్తింపు సాధించగలగడం మన అందరికీ గర్వకారణమే. భూదాన్ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు లభించడంపై సిఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటక సంస్థ జారీ చేసిన గుర్తింపు పత్రాన్ని సిఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, పర్యాటక శాఖ ఎండీ బి. మనోహర రావులకు అందజేసి శాలువా కప్పి సన్మానించి అభినందనలు తెలియజేశారు.