ఢిల్లీ సీఎం, ఆమాద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీని పంజాబ్‌కు విస్తరించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన జరుగబోయే పంజాబ్ శాసనసభ ఎన్నికలకు ఇప్పటికే పార్టీ అభ్యర్ధులను ప్రకటించి జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. వారిలో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో కోరుతూ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. దానిలో 19 లక్షల మంది పాల్గొనగా వారిలో 93 శాతం మంది పంజాబ్ ఆమాద్మీ పార్టీ అధ్యక్షుడు భగవంత్ మాన్‌ను కోరుకొంటున్నట్లు తేలిందని కనుక ఆయనే తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం మొహాలీలో ప్రకటించారు. పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా శాసనసభ ఎన్నికల ఫలితాలు మార్చి 10వ తేదీన వెలువడుతాయి.