సంబంధిత వార్తలు

పంజాబ్‌కు చెందిన చదరంగం క్రీడాకారిణి మాలిక హండాకు మంత్రి కేటీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో రూ.15 లక్షలు ఆర్ధిక సాయం, ఒక ల్యాప్‌టాప్ అందజేశారు. పుట్టుమూగ అయిన తాను అనేక జాతీయస్థాయి పోటీలలో పాల్గొని పతకాలు సాధించినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం తనకు ఎలాంటి సహాయం అందించడంలేదని ఆమె ట్వీట్ చేయగా, అది చూసిన మంత్రి కేటీఆర్ ఆమెను జలందర్ నుంచి హైదరాబాద్‌కు రప్పించి వ్యక్తిగతంగా ఈ సాయం అందించారు. కేంద్రప్రభుత్వం కూడా ఆమెకు సాయపడి ప్రోత్సహించాలని కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.