సంబంధిత వార్తలు
తెలంగాణ ఆశా వర్కర్లకు శుభవార్త! కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎన్‌హెచ్ఎం కింద పని చేస్తున్న ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్ (గౌరవ వేతనం) 30 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారికి నెలవారీ అందే గౌరవ వేతనం రూ.7,500 నుంచి రూ.9,750కి పెరుగనుంది. ఈ పెంపు గత ఏడాది జూన్ నెల నుంచి వర్తిస్తాయని ఉత్తర్వులలో పేర్కొంది. కనుక గత ఆరు నెలలకు కలిపి డిసెంబర్ వరకు ఎరియర్స్ రూ.13,500+జనవరి నెల గౌరవ వేతనం రూ.9,750తో కలిపి మొత్తం రూ.23,250 ఫిభ్రవరిలో అందుకోబోతున్నారు.