రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేసి జైలుకి పంపించడాన్ని నిరసిస్తూ ఈనెల 10వ తేదీన తెలంగాణ బంద్‌కు బిజెపి బుదవారం పిలుపునిచ్చింది. కానీ నిన్ననే హైకోర్టు బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేయడంతో బంద్‌ను ఉపసంహరించుకొంటున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. దాంతోబాటు బిజెపి తలపెట్టిన నిరసన కార్యక్రమాలను కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.
ఛత్తీస్‌ఘడ్ మాజీ ముఖ్యమంత్రి రమన్ సింగ్, జాతీయ బిజెపి ఓబీసీ ఛైర్మన్ కే.లక్ష్మణ్, రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, ఇంకా రాష్ట్ర బిజెపి నేతలు ఈరోజు కరీంనగర్ వెళ్ళి బండి సంజయ్‌ను పరామర్శించనున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా శుక్రవారం హైదరాబాద్ వచ్చి బండి సంజయ్‌ను పరామర్శించనున్నట్లు జి.ప్రేమేందర్ రెడ్డి చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.