సింగరేణి కార్మికులకి బారీ బోనస్

 సింగరేణి కార్మికుల శ్రమకి తగ్గ ఫలం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం వారికి బారీ బోనస్ ప్రకటించింది. 2015-16 సం.లలో సింగరేణికి రూ. 1066.13 కోట్లు లాభం వచ్చింది. దానిలో 23 శాతం వాటా అంటే రూ.243.21 కోట్లు కార్మికులకి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అది గాక దీపావళి బోనస్ గా ప్రతీ కార్మికుడికి మరో రూ.54,000 బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. కనుక ఒక్కో కార్మికుడు రెండూ కలిపి సుమారు రూ.97,000 వరకు ఈనెల అందుకోబోతున్నాడు. సింగరేణి కాహ్రిత్రలో ఇంత భారీ బోనస్ ఇవ్వడం ఇదే మొదటిసారి. కార్మికుల కృషి వలెనే సంస్థకి ఇంత బారీ లాభాలు వచ్చాయి కనుక దానిలో వారికి సముచితమైన వాటా ఇవ్వడం చాలా సమంజసమే. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు అందరికీ ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు, పండుగ శుభాకాంక్షలు  తెలియజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి కార్మికులకి మరికొన్ని వరాలు కూడా ప్రకటించారు. 

1. స్వచ్చంద పదవీ విరమణ చేసిన కార్మికుల పిల్లలకి సింగరేణిలో ఉద్యోగం ఇవ్వడం. ఇక నుండి ఈ ప్రక్రియని నిరంతరం కొనసాగిస్తుండటం.

2. కార్మికుల కోసం సింగరేణిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం.