4.jpg)
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పధకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ నెల 10వరకు మొత్తం రూ.50,000 కోట్లు రైతులకు అందజేసింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా రైతుబంధు వేడుకలు జరుపుకోవాలని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోవిడ్ నిబందనలు పాటిస్తూ వారం రోజుల పాటు ఈ వేడుకలు జరుపుకోవాలని కోరారు.
అయితే ఈ నెల 10వరకు రాష్ట్రంలో రాజకీయ సభలు, సామూహిక సమావేశాలు, ర్యాలీలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేదం విధించింది. ఆ కారణంతోనే మొన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, నిన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.
ప్రజాసమస్యలపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరసన దీక్షలు లేదా సమావేశాలకు చేయాలనుకొంటే కరోనా ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారని ముందే అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీ సమావేశాలకు, ఇటువంటి వేడుకలకు ఎందుకు అభ్యంతరం చెప్పారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కరోనా ఆంక్షలు కేవలం ప్రతిపక్షాలకేనా...టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు వర్తించదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.