రేవంత్‌ రెడ్డికి కరోనా పాజిటివ్

కాంగ్రెస్‌ ఎంపీ, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కరోనా బారిన పడ్డారు. నిన్న కొద్దిగా జలుబు, జ్వరం రావడంతో వెంటనే పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అయితే జలుబు, జ్వరం తప్ప మరి ఎటువంటి సమస్యలు లేవు. కానీ కరోనా అని నిర్ధారణ అవడంతో ఆయన హోమ్ క్వారెంటైన్‌లో ఉంటున్నారు. గత రెండు మూడు రోజులలో తనను కలిసినవారందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకొని, కరోనా అని నిర్ధారణ అయితే హోమ్ క్వారెంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.