సంబంధిత వార్తలు

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి (86) ఈరోజు ఉదయం 8.30 గంటలకు చెన్నైలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన అలనాటి మేటి నటులు ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు తదితరులతో అత్తాకోడళ్ళు, భలే అల్లుడు, పాడి పంటలు, నవోదయం, మానవుడు దానవుడు, బడిపంతులు, విచిత్ర దాంపత్యం, అన్నాచెల్లెల్లు, రగిలే గుండెలు, బంగారు కాపురం, పెద్దలు మారాలి వంటి 80కి పైగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారు. వాటిలో చాలా సినిమాలు 100 శతదినోత్సవం ఆడాయి. తెలుగు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.