రేవంత్‌ రెడ్డి మళ్ళీ అరెస్ట్... రచ్చరచ్చ...రచ్చబండ

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని పోలీసులు ఈరోజు మళ్ళీ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో ఈరోజు వరంగల్‌ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో శయంపేటలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్‌ రెడ్డి బయలుదేరుతుండటంతో, పోలీసులు ముందుగానే జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకొని ఆయనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా గృహనిర్మబందం చేశారు. పోలీసులు తనను నిర్బందించడంపై రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, “నేనేమైనా నిషేదిత పార్టీకి అధ్యక్షుడినా? లేదా రచ్చబండలో రైతులతో మాట్లాడి వారి కష్టానష్టాలు తెలుసుకోవాలనుకోవడం నేరమా? రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు చనిపోతే సిఎం కేసీఆర్‌ పట్టించుకోరు. కానీ మేము రైతులను పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులతో అడ్డుకొని ఈవిదంగా గృహనిర్బందంలో ఉంచుతారు. కనీసం బందుమిత్రుల ఇళ్ళలో శుభకార్యాలకు బయలుదేరాలన్నా పోలీసులు డేగ కన్నుతో చూస్తుంటారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యమో అర్ధం కాదు,” అని అన్నారు.