మాజీ మంత్రి టిఆర్ఎస్‌ నేత ఫరీదుద్దీన్ మృతి

మాజీ మంత్రి, టిఆర్ఎస్‌ నేత మహ్మద్ ఫరీదుద్దీన్ (67) గుండెపోటుతో బుదవారం సాయంత్రం హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా కాలేయం సంబందిత సమస్యతో బాధపడుతుండటంతో ఆ చికిత్స కోసం సుమారు మూడు వారాల క్రితం హాస్పిటల్లో చేరారు. నిన్న సాయంత్రం సుమారు 6 గంటలకు హటాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయారు. 

  మహ్మద్ ఫరీదుద్దీన్ స్వగ్రామం సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలంలోని హోతి(బి). ఆ గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి, ఎమ్మెల్యే (కాంగ్రెస్‌), స్వర్గీయ వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. తరువాత 2015లో టిఆర్ఎస్‌లో చేరి 2016లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత ఏడాది జూన్‌లో ఆయన పదవీకాలం ముగిసిన తరువాత ఆరోగ్యసమస్యలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

 మహ్మద్ ఫరీదుద్దీన్ మృతికి సిఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఈరోజు సంగారెడ్డిలో ఆయన అంత్యక్రియలకు సిఎం కేసీఆర్‌ హాజరుకాబోతున్నారు.