ఓవైసీ-మిధాని ఫ్లైఓవర్‌కు అబ్దుల్ కలాం పేరు ఖరారు

హైదరాబాద్‌ నగరంలో ఓవైసీ-మిధాని ఫ్లైఓవర్‌కు మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు ఖరారు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ ప్రాంతంలో కొంతకాలం నివశించి, డిఆర్‌డీవోకు విశేషసేవలందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాంకు ఇది ఓ చిన్న నివాళి వంటిది,” అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.  హోంమంత్రి మహమూద్ ఆలీ, మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలతో కలిసి మంత్రి కేటీఆర్‌ డాక్టర్ అబ్దుల్ కలాం ఫ్లైఓవర్‌కు ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలువురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు