తెలంగాణలో నేటి నుంచే కరోనా ఆంక్షలు అమలు

హైకోర్టు ఆదేశం మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆంక్షలు నేటి నుంచి జనవరి 2వరకు అమలులో ఉంటాయి. ఈ సమయంలో బహిరంగసభలు, ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు  ప్రకటించింది. అయితే క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలలో అన్ని కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో వేడుకలు జరుపుకొనేందుకు అనుమతించింది. మాస్కు ధరించకుండా బయటకు వస్తే పోలీసులు రూ.1,000 జరిమానా విధిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.