తెలంగాణలో ఆంక్షలు విధించాలి: హైకోర్టు ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న ఈ తరుణంలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు రోజులలోగా ఉత్తర్వులు జారీ చేయాలని గడువు కూడా విధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆంక్షలను అమలుచేయాలని కూడా సూచించింది. ఇతర రాష్ట్రాలలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నందున అక్కడి నుంచి వస్తున్న వారి ద్వారా తెలంగాణలో ఒమిక్రాన్‌ వ్యాపించే ప్రమాదం ఉన్నందున రైల్వే స్టేషన్లలో కూడా ఒమిక్రాన్‌ పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.