సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా నరేందర్ రావు ఎన్నిక

తెలంగాణ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా మళ్ళీ నరేందర్ రావు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా షేక్ యూసఫ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ప్రభుత్వ అదనపు కార్యదర్శి శేఖర్ బుదవారం వారిరువురికీ నియామక పత్రాలను అందజేశారు. త్వరలోనే 26 మందితో కూడిన కార్యవర్గం ఏర్పాటు చేయబోతున్నట్లు నరేందర్ రావు తెలిపారు. సచివాలయం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని నరేందర్ రావు, షేక్ యూసఫ్ తెలిపారు.