
ఈ ఏడాది జూలై నెలలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేటలో నియోపోలీస్ వెంచర్‌లో సుమారు 50 ఎకరాలు విస్తీర్ణం గల 8 ఫ్లాట్లను ఆన్‌లైన్‌లో వేలం వేసిన సంగతి తెలిసిందే. ఆ భూములను కొనుగోలు చేసిన సంస్థల పేరిట రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ బుదవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.
కోకాపేట భూములకు కనిష్ట ధరను ఎకరానికి రూ. 25 కోట్లు హెచ్ఎండీఏ నిర్ణయించగా, పోటాపోటీగా సాగిన ఆన్‌లైన్ వేలంపాటలో ఎకరం కనిష్టంగా రూ.31.2 కోట్లు, గరిష్టంగా 61.2 కోట్లు చొప్పున అమ్ముడుపోయాయి. కనుక అంత భారీ ధర చెల్లించి కొనుగోలు చేసిన భూములకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయితే వాటిలో భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని వాటిని కొనుగోలు చేసిన సంస్థలు ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం ఇపుడు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారికి ఉపశమనం లభించినట్లయింది.