తెలంగాణ హోంగార్డులకు శుభవార్త

క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హోంగార్డులకు శుభవార్త వినిపించింది. వారి రోజువారి వేతనాలను 30 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వారికి రోజుకు రూ.675 వేతనం చెల్లిస్తోంది. దానిని రూ.877కి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వారు ఇక నుంచి నెలకు రూ.26-27,000 వరకు వేతనం అందుకొంటారు. ఈ పెంపుతో రాష్ట్రంలోని 20 వేలమంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారు.