దళిత బంధుకి రూ.250 కోట్లు విడుదల

టిఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పధకం అమలుకు రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో నాలుగు నియోజకవర్గాలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.250 కోట్లు నిధులు విడుదల చేసింది. వాటిలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో చింతకానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరికి రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌కు రూ. 50 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోగల చారగొండకు రూ.50 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలలో మంగళవారం సొమ్ము జమా చేసింది. కనుక ఒకటి రెండు రోజులలో ఈ నాలుగు గ్రామాలలో ఎంపిక చేసిన దళిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్లు ఈ సొమ్మును అందజేస్తారు.