25.jpg)
సిఎం కేసీఆర్ ఆదిసోమవారాలలో వనపర్తి, జనగామ జిల్లాలలో పర్యటించవలసి ఉండగా అనివార్య కారణాల వలన అది ఈనెల 23కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. వనపర్తిలో పర్యటనలో అక్కడ కొత్తగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయం, మార్కెట్లో యార్డ్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. జిల్లాలో వైద్య, నర్సింగ్ కళాశాలలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, వేరుశనగ పరిశోధనా కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, నీటిపారుదల సీఈ కార్యాలయ భవన నిర్మాణాలకు శంఖుస్థాపనల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సిఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన ఇంకా వెలువడవలసి ఉంది.