
ప్రస్తుతం దేశంలో ఆడపిల్లలకు 18 ఏళ్ళు, మగ పిల్లలకు 21 ఏళ్ళు నిండితేగానీ పెళ్ళి చేయకూడదు. ఒకవేళ చేస్తే దానిని బాల్య వివాహంగా పరిగణించి చట్ట ప్రకారం శిక్షించవచ్చు. కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఆడపిల్లల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్ళకు పెంచబోతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాలలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. దీంతో హిందూ వివాహాల చట్టం-1955, బాల్యవివాహాల నిరోధక చట్టం-2006, ప్రత్యేక వివాహాల చట్టాలలో సవరణలు చేయనుంది. ఇది చట్టరూపం దాల్చితే 21 ఏళ్ళు నిండకుండా ఆడపిల్లలకు పెళ్ళి చేస్తే నేరం అవుతుంది.
మహిళలకు కూడా సాధికారత కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొంది తప్ప జనాభా నియంత్రణ కోసం కాదని కేంద్రప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.