ఆ ముగ్గురు టిఆర్ఎస్‌ నేతలకు పదవులు

తెలంగాణ ప్రభుత్వం మూడు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు చైర్మన్లను నియమించింది. టిఆర్ఎస్‌ సామాజిక విభాగం నాయకుడు మన్నే క్రిశాంక్‌ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా, గాయకుడు, టిఆర్ఎస్‌ ధూంధాం కళాకారుడు వేదశాయి చంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా, ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుదవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి ముగ్గురి పదవీకాలం రెండేళ్ళు.