త్రివిధ దళాధిపతిగా ఎంఎం నరవణే?

భారత్‌ తొలి త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులో హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేను సీడీఎస్‌గా నియమించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కానీ త్రివిధ దళాల సీనియర్ కమాండర్లతో కూడిన ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేసి దాని సిఫార్సు మేరకు సీడీఎస్‌ను నియమించనుండి. ఎంఎం నరవణే మరో 5 నెలల్లో ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేయనున్నారు. కనుక ఆయనను సీడీఎస్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.