అమరజవాన్లకు ప్రధాని మోడీ నివాళులు

తమిళనాడులో కూనూర్ సమీపంలో హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన అమరుల భౌతిక కాయలను సూలూరు ఎయిర్ బేస్ ఉంచి ప్రత్యేకవిమానంలో నిన్న సాయంత్రం ఢిల్లీకి తరలించారు. అక్కడ రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్, ప్రధాని నరేంద్రమోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్రమంత్రులు, ఆర్మీ, నేవీ, వాయుసేన ఛీఫ్స్, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు నివాళులు అర్పించారు. ఈరోజు బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ఢిల్లీలో కంటోన్మెంట్‌ ఏరియాలో జరుగుతాయి.