
కేంద్రప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవయసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వేలాదిమంది రైతులు సుమారు 12 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల వద్ద ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారు కోరినట్లుగానే కేంద్రప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకోవడమే కాక వారి ఇతర డిమాండ్లపై కూడా సానుకూలంగా స్పందించింది. కనుక రైతు సంఘాల నేతలు నేడు తమ ఆందోళన విరమించుకొనే అవకాశం ఉంది. భారత్ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ మీడియాతో మాట్లాడుతూ బుదవారం దీనిపై తుది నిర్ణయం తీసుకొని ప్రకటన చేస్తామని తెలిపారు. ఒకవేళ వారు ఆందోళన విరమించి ఇళ్ళకు తిరిగి వెళితే వ్యవయసాయ చట్టాలతో తీవ్ర విమర్శలు, అప్రదిష్టపాలైన కేంద్రప్రభుత్వానికి చాలా ఊరట లభిస్తుంది.