3.jpg)
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్రమోడీ రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మూడు వ్యవయసాయ చట్టాలను తొలిరోజే లోక్సభలో ప్రవేశపెట్టి రద్దు చేశారు. వాటిపై మళ్ళీ చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి కానీ వారి నిరసనలు, ఆందోళన నడుమే వాటి రద్దుకు సంబందించిన బిల్లును లోక్సభ ఆమోదించింది.
ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఢిల్లీ శివార్లలో ఆందోళనలు చేస్తున్న రైతులకు క్షమాపణలు చెప్పి, వారు కోరినట్లుగానే మూడు వ్యవయసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ రైతులు ఇంకా ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. వారు కేంద్రప్రభుత్వం ముందు మరికొన్ని డిమాండ్స్ ఉంచారు. వాటిపై చర్చించేందుకు కేంద్రప్రభుత్వం మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.