
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ గోపురం బంగారు తాపడం కొరకు 2 కేజీల బంగారం విరాళంగా ఇచ్చారు. ఈరోజు ఉదయం ఆయన సతీసమేతంగా ఆలాయానికి వచ్చి రెండు కిలోల బంగారాన్ని ఆలయ ఈవో గీతకి అందజేశారు. ఈవిదంగా తాము కూడా ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగస్వాములు కావడం తమకు ఎంతో సంతోషం కలిగిస్తోందని మర్రి జనార్ధన్ రెడ్డి దంపతులు అన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయపూజారులు వారికి సకల మర్యాదలతో స్వాగతం పలికారు. మర్రి జనార్ధన్ రెడ్డి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్న తరువాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.