సంబంధిత వార్తలు
2.jpg)
టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈరోజు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌ను కలిసి ఓ లేఖ ఇచ్చారు. టీఎస్ఆర్టీసీ నష్టాలలో ఉన్నందున సంస్థపై మరింత భారం మోపడం తనకు ఇష్టం లేదని కనుక టీఎస్ఆర్టీసీ నుంచి తాను ఎటువంటి జీతభత్యాలు తీసుకోనని ఆ లేఖలో పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇస్తున్న జీతభత్యాలు చాలని తెలిపారు. టీఎస్ఆర్టీసీని మళ్ళీ లాభాలబాటలో పెట్టేందుకు అన్నివిదాల సహకరిస్తానని హామీ ఇచ్చారు. బాజిరెడ్డి గోవర్ధన్ నిర్ణయం పట్ల టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఉద్యోగ సంఘాల నేతలు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.