మరో నాలుగు నెలలు ఉచిత బియ్యం పంపిణీ

కరోనా విపత్కాలంలో పనులు దొరక్క, ఆదాయం లేక బాధలు పడుతున్న కార్మికులను, నిరుపేదలను ఆదుకొనేందుకు కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పధకం కింద అర్హులైన ప్రతీ ఒక్కరికీ నెలకు 5 కేజీల చొప్పున బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేసింది.దీని ద్వారా దేశంలో 80 కోట్ల మందికి ఆహార భద్రత లభించింది. 

ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పధకాన్ని మరో నాలుగు నెలలు అంటే 2022, మార్చి వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ పధకానికి అయ్యే పూర్తి ఖర్చును కేంద్రప్రభుత్వమే భరిస్తుంది.