నేడు హైదరాబాద్‌ రానున్న ప్రియాంకా గాంధీ

యూపీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్ ప్రియాంకా గాంధీ బుదవారం హైదరాబాద్‌ రానున్నారు. ఆమె కుమారుడు రైహాన్‌కు సుమారు నాలుగేళ్ళ క్రితం క్రికెట్ ఆడుతున్నప్పుడు కంటికి బాల్ తగిలి గాయం అయ్యింది. అప్పుడు ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళగా అక్కడి వైద్యుల సలహా మేరకు రైహాన్‌కు హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు. రైహాన్‌కు మళ్ళీ మరోసారి కంటి పరీక్షలు చేయించేందుకు హైదరాబాద్‌ తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్ నేతలు ఆమెను మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు సమాచారం.