
స్థానిక సంస్థల కోటాలో జరుగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు నిన్నటితో ముగుగుస్తుండటంతో భారీగా చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
టిఆర్ఎస్ తరపున కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), డాక్టర్ యాదవ్ రెడ్డి (మెదక్), పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు (రంగారెడ్డి), కె.దామోదర్ రెడ్డి, కె.నారాయణ రెడ్డి (మహబూబ్నగర్), ఎంసీ కోటిరెడ్డి కోటిరెడ్డి (నల్గొండ), తాత మధు (ఖమ్మం), దండే విఠల్ (ఆదిలాబాద్), ఎల్.రమణ, తానిపర్తి భానుప్రసాద్ (కరీంనగర్) నామినేషన్లు వేశారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ (టిఆర్ఎస్) స్వతంత్ర అభ్యర్ధిగా కరీంనగర్లో నామినేషన్ వేశారు, వీరితో పాటు కాంగ్రెస్, బిజెపి బలపరిచిన మరో 26 మంది స్వతంత్ర అభ్యర్ధులు కరీంనగర్లో నామినేషన్లు వేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్:
నోటిఫికేషన్: నవంబర్ 16న
నామినేషన్లు స్వీకరణ: 16 నుంచి 23వరకు
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 24
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: నవంబర్ 26వరకు
పోలింగ్: డిసెంబర్ 10న
ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: డిసెంబర్ 14న.