గత ఏడాది జూన్ నెలలో గల్వాన్ లోయలో చైనా సైనికులను అడ్డుకొనే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రప్రభుత్వం మహావీర్ చక్ర అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కల్నల్ సంతోష్ బాబు భార్య, తల్లి రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా కల్నల్ సంతోష్ బాబును గౌరవిస్తూ ఆయన కుటుంబానికి రూ.5 కోట్లు, హైదరాబాద్‌లో ఇంటి స్థలం, కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి వాణిజ్యశాఖలో ఉద్యోగం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆనాడు కల్నల్ సంతోష్ బాబుతో పాటు 21 మంది భారత్ జవాన్లు కూడా మృతి చెందారు. వారిలో సిపాయ్ గురుతేజ్ సింగ్, సిపాయ్ నాయక్ దీప్ సింగ్, హవల్దార్ కె పలానీ, నాయక్ సుబేదర్ నుదురామ్ సోరేన్‌ల తరపున వారి కుటుంబ సభ్యులు వీర్ చక్ర అవార్డులను అందుకున్నారు.