సంబంధిత వార్తలు

మాజీ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. మొదట ఆమె మళ్ళీ పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో ఆమె స్థానంలో ఆకుల లలితకు అవకాశం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ నేటితో నామినేషన్ల గడువు ముగుస్తుందనగా సోమవారం సాయంత్రం సిఎం కేసీఆర్ ఆమె పేరును ఖరారు చేసారు. కనుక ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఆమె నామినేషన్ వేయబోతున్నారు. టిఆర్ఎస్‌కు స్థానిక సంస్థలపై పూర్తి పట్టు ఉన్నందున ఆమె ఎన్నిక లాంఛనప్రాయమే.