
వచ్చే నెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్సీలలో భానుప్రసాద్ (కరీంనగర్), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి (రంగారెడ్డి), శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణ రెడ్డి (మహబూబ్‌నగర్) ఐదుగురికీ మాత్రమే సిఎం కేసీఆర్ మళ్ళీ అవకాశం కలిపించినట్లు సమాచారం.
కొత్తగా నారదాసు లక్ష్మణ్ రావు (కరీంనగర్) స్థానంలో ఎల్.రమణ, కల్వకుంట్ల కవిత (నిజామాబాద్) స్థానంలో మళ్ళీ ఆకుల లలిత, తేరా చిన్నప్పరెడ్డి (నల్గొండ) స్థానంలో ఎంసీ కోటిరెడ్డి, పురాణం సతీష్ (ఆదిలాబాద్) స్థానంలో దండే విఠల్‌కు అవకాశం కల్పించినట్లు తాజా సమాచారం.
నామినేషన్ల దాఖలుకు రేపటితో గడువు ముగుస్తున్నందున 12 మంది టిఆర్ఎస్ అభ్యర్ధులు ఎవరనే దానిపై నేడే పూర్తి స్పష్ఠత వచ్చే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్:
నోటిఫికేషన్: నవంబర్ 16న
నామినేషన్లు స్వీకరణ: 16 నుంచి 23వరకు
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 24
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: నవంబర్ 26వరకు
పోలింగ్: డిసెంబర్ 10న
ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: డిసెంబర్ 14న.