
ధాన్యం సేకరణ, కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ సిఎం కేసీఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ మంత్రులు మొదలు గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల వరకు ఈరోజు హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేయబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష చేస్తామని సిఎం కేసీఆర్ స్వయంగా మంగళవారం ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. దీక్ష ముగిసిన తరువాత అందరూ రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి ఈ సమస్యపై వినతిపత్రం ఇస్తామని తెలిపారు. ఒకవేళ కేంద్రప్రభుత్వం రెండు మూడు రోజులలోగా స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రప్రభుత్వాన్ని, బిజెపిని వెంటాడి వేటాడుతూనే ఉంటామని ఈసారి విడిచిపెట్టే ప్రసక్తే లేదని సిఎం కేసీఆర్ హెచ్చరించారు.