సంబంధిత వార్తలు
సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నందున, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంత రావుకు సిద్ధిపేట కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.