సిఎం కేసీఆర్కు అంత్యంత ఆప్తులలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా ఒకరు. ఆయన పనిచేస్తున్న జిల్లాలో ఎప్పుడు ఏ సభలో సిఎం కేసీఆర్ పాల్గొన్నా ఆయన ప్రశంశించకుండా ఉండరు. ఇవాళ్ళ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. వెంకట్రామిరెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. అదే నిజమైతే సిఎం కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపుపై సిఎం కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలతో ప్రగతి భవన్లో ప్రస్తుతం సమావేశమయ్యి చర్చిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయడం చూస్తే, సిఎం కేసీఆర్ సూచన మేరకే ఆయన పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీగా ప్రత్యక్ష రాజకీయాలలోకి, శాసనమండలిలోకి అడుగుపెట్టబోతున్నారేమో?అనిపిస్తుంది. మరికొద్ది సేపటిలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.