సిఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన రద్దు

సిఎం కేసీఆర్‌ వరంగల్‌, హన్మకొండ జిల్లాల పర్యటన రద్దయింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం షెడ్యూల్ వెలువడటంతో మళ్ళీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఆయా జిల్లాలలో సిఎం కేసీఆర్‌ ఎటువంటి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనలేరు కనుక బుద, గురువారాలలో ఆయన పర్యటన రద్దు అయ్యింది. ఎన్నికల కోడ్ కారణంగానే ఈ నెల 29న వరంగల్‌లో టిఆర్ఎస్‌ జరుపదలచిన విజయగర్జన సభ కూడా వాయిదా పడింది.