సంబంధిత వార్తలు
38.jpg)
సిఎం కేసీఆర్ బుదవారం వరంగల్, హన్మకొండ జంట నగరాలలో పర్యటించనున్నారు. రెండు జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లాల ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించేందుకుగాను సిఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ముఖ్యంగా హన్మకొండ, వరంగల్ జంట నగరాల మద్య ప్రత్యేకంగా ప్రజారవాణా వ్యవస్థ, రెండు నగరాలలో రోడ్లు, వరంగల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, వరంగల్లో టెక్స్టైల్ పార్కు పనుల పురోగతి, రైల్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం మొదలైన అంశాలపై ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు.