ప్రపంచ కప్‌లో భారత్‌-పాక్‌ తలపడాలి: షోయబ్ అక్తర్

పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ రేపు ఆదివారం ఆఫ్ఘనిస్తాన్‌-న్యూజిలాండ్ మద్య జరుగబోయే టి20 మ్యాచ్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఈ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ గెలిస్తే పర్వాలేదు కానీ ఓడిపోతే పాక్‌ క్రికెట్ అభిమానులు న్యూజిల్యాండ్ జట్టును ట్రోల్ చేయకుండా విడిచిపెట్టారు. అలా జరుగకూడదంటే ఈ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ గెలిస్తే చాలు. ఇప్పుడు యావత్ భారతీయులు ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ గెలవాలని కోరుకొంటున్నారని తెలుసు. మేము కూడా భారత్‌ ఫైనల్స్ చేరుకొంటే భారత్‌తో ఆడాలని కోరుకొంటున్నాము. భారత్‌-పాక్‌ మద్య ఫైనల్స్ మ్యాచ్ జరిగితే ప్రపంచ కప్ పోటీలు మరింత రసవత్తరంగా మారుతాయి. ఆవిదంగా జరిగితే పాక్‌ క్రికెట్‌కు కూడా చాలా మంచిది. పాక్‌ క్రికెట్‌కు దీంతో కాస్త బూస్టింగ్ లభిస్తుంది. కానీ రేపు ఏమి జరుగబోతోందో చూడాలి,” అని అన్నారు.       

రెండు రోజుల క్రితం కూడా షోయబ్ అక్తర్ భారత్‌ తప్పక సెమీస్‌లోకి రావాలని, భారత్‌-పాక్‌ ఫైనల్స్ లో తలపడాలని కోరుకొంటున్నానని అన్నాడు. మరి షోయబ్ కోరుకొంటున్నట్లు భారత్‌ సెమీస్‌లోకి ప్రవేశిస్తుందా?చూడాలి.