సంబంధిత వార్తలు

ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉదయం కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రంలో పర్యటించి కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆలయం వెనుక ఉన్న ఆదిశంకరాచార్యుల వారి సమాధి 2013 వరదల్లో దెబ్బ తింది. దానిని పునరుద్దరించి అక్కడే 12 అడుగుల ఎత్తు, 35 టన్నుల బరువు గల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.