ఆ నాలుగు జిల్లాలు...హైపవర్ కమిటీ చేతులో!

జిల్లాల పునర్విభజన ప్రక్రియపై ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న తన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సుదీర్గంగా చర్చించిన తరువాత, ఇదివరకు ప్రకటించిన 27 జిల్లాలు కాకుండా అధనంగా సిరిసిల్లా, గద్వాల, జనగామ, ఆసిఫాబాద్ జిల్లాలని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. కానీ ఆ నాలుగు జిల్లాల ఏర్పాటు అవసరమా కాదా..అనే విషయంపై మరింత లోతుగా చర్చించవలసిన అవసరం ఉందని భావించడంతో తెరాస రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు నేతృత్వంలో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. దానిలో ఉప ముఖ్యమంత్రి మహామూద్ ఆలి, మంత్రులు జోగు రామన్న, పోచారం శ్రీనివాస రెడ్డి, జగదీశ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. వారు ఈ నాలుగు జిల్లాల ఏర్పాటుపై చర్చించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఈనెల 7వ తేదీ మధ్యాహ్నంలోగా తమ అభిప్రాయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కి తెలియజేయవలసి ఉంటుంది. 

ఈ కారణంగా తెలంగాణాలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉండబోతున్నాయనే విషయంపై మళ్ళీ సస్పెన్స్ మొదలైంది. కొత్త జిల్లాలు ఏర్పాటుకి గడవు దగ్గర పడుతున్నప్పటికీ నేటికీ వాటిపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉండటంతో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. కొత్త జిల్లాలకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత వారిపైనే ఉంటుంది. గడువు దగ్గర పడుతున్న ఈ సమయంలో ముఖ్యమంత్రి హటాత్తుగా జిల్లాల సంఖ్య పెంచుకొంటూ పోవడం, మండలాల కూర్పుని మార్చుతుండటం వలన వారిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఇప్పుడు 7వ తేదీ వరకు ఆ నాలుగు జిల్లాలపై ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో తెలియదు కనుక అధికారులపై ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ ఆ రోజే కొత్త జిల్లాల ఏర్పాటుపై అంతిమ నిర్ణయం తీసుకొన్నప్పటికీ, ఆ నాలుగు జిల్లాలకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి వారికి కేవలం 3 రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంటుంది.   

ఒకవేళ ఆ నాలుగు జిల్లాలలో ఏ ఒక్క జిల్లా విషయంలోనైనా ప్రభుత్వం ఒకవేళ మళ్ళీ వెనకడుగు వేసినట్లయితే మళ్ళీ జిల్లాల కూర్పు మారిపోతుంది కనుక అది కూడా సంబంధిత శాఖల ఉద్యోగులు, అధికారులపై తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. జిల్లాలు, మండలాల కూర్పుపై ఇంత సందిగ్దత నెలకొని ఉన్నప్పుడు ఇంత హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కోట్లమంది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే ఇటువంటి 

 కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన హైపవర్ కమిటీ నేటి నుండి ఆ నాలుగు ప్రతిపాదిత జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులతో వరుసగా సమావేశాలు నిర్వహించబోతోంది.