రాజేంద్రనగర్‌ పరిధిలో 6 నెలలు ట్రాఫిక్ మళ్లింపు

హైదరాబాద్‌, రాజేంద్రనగర్ పరిధిలో గల శాస్త్రీపురం వద్ద సికింద్రాబాద్‌- ఫలక్‌నూమా-శివరాంపల్లి రైల్వేలైన్‌కు సంబందించి ఆర్‌ఓబీ పనులు ప్రారంభం కానున్న నేపధ్యంలో నవంబర్‌ 1వ తేదీ నుంచి ఆరు నెలల పాటు ఆ ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్లించబోతున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వట్టేపల్లి-మెహముదా హోటల్-మెహఫిల్ హోటల్-మైలార్‌దేవ్‌పల్లి జంక్షన్‌ మీదుగా వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. కనుక ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించబోతున్నారు. 

మైలార్‌దేవ్‌పల్లి-అరాంఘర్‌ క్రాస్‌ రోడ్-శాస్త్రిపురం మెయిన్‌ రోడ్-వట్టేపల్లి రోడ్-శాస్త్రిపురం రోడ్-శివరాంపల్లి రైల్వే రోడ్-మైలార్‌దేవ్‌పల్లి.

వట్టేపల్లి రోడ్-ఇంజిన్‌ బౌలీ క్రాస్‌ రోడ్- ఫలక్‌నుమా రోడ్- చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి-అరాంఘర్‌ క్రాస్‌ రోడ్-శాస్త్రిపురం ప్రధాన రోడ్-తాడ్‌బన్‌ జంక్షన్‌- కాలాపత్తర్‌ రోడ్- శంషీర్‌గంజ్‌ జంక్షన్‌-ఇంజిన్‌ బౌలీ క్రాస్‌ రోడ్-వట్టేపల్లి రోడ్.