యాదగిరిగుట్ట సీఐ నర్సయ్యపై సస్పెన్షన్ వేటు

రాచకొండ కమీషనరేట్ పరిధిలోని యాదగిరిగుట్ట రూరల్ పోలీస్‌స్టేషన్‌ సీఐ నర్సయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల ఆయన ఓ మహిళా పోలీస్‌తో అసభ్యంగా వ్యవహరించడంతో ఆమె పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె పిర్యాదుపై వెంటనే స్పందిస్తూ సీఐ నర్సయ్యను సస్పెండ్ చేసినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. నర్సయ్య స్థానలో ఎల్బీ నగర్‌ సెంట్రల్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ బీనవీన్ రెడ్డిని నియమిస్తూ రాచకొండ పోలీస్ కమీషనర్‌ మహేశ్ ఎమ్మెల్యే భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు.