.jpg)
రోమ్ నగరంలో జరుగబోయే పదహారవ జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరారు. కరోనా తీవ్రత తగ్గిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఈ ప్రత్యక్ష సదస్సులో జీ-20 భాగస్వామ్య దేశాధినేతలందరూ పాల్గొనబోతున్నారు. కనుక దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు రోమ్ చేరుకోగానే ముందుగా అక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళులు ఆర్పిస్తారు. ఆ తరువాత వాటికన్ సిటీకి వెళ్ళి అక్కడ పోప్ ఫ్రాన్సిస్‌ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. నేటి నుంచి ఈ నెల 31వరకు ప్రధాని నరేంద్రమోడీ రోమ్, వాటికన్ సిటీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఇటలీ ప్రధాని మారియో డ్రాగితో భేటీ అవుతారు.
ఆ తరువాత అక్కడి నుండి బ్రిటన్‌లోని గ్లాస్గో నగరం చేరుకొని నవంబర్ 1,2 తేదీలలో సీఓపీ-26 సదస్సులో పాల్గొంటారు. బ్రిటన్ పర్యటనలో ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అవుతారు. సదస్సు ముగిసిన తరువాత భారత్ తిరుగు ప్రయాణం అవుతారు.