నవంబర్‌ 15న ప్రయాణాలు పెట్టుకోవద్దు: కేటీఆర్‌

వచ్చే నెల 15వ తేదీన వరంగల్‌లో టిఆర్ఎస్‌ విజయ గర్జన సభ జరుగబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలను, టిఆర్ఎస్‌ కార్యకర్తలను తరలించేందుకు టిఆర్ఎస్‌ 7,000 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోబోతోందని, కనుక ఆ రోజున ప్రజలెవరూ బస్సు ప్రయాణాలు పెట్టుకోవద్దని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. విజయగర్జన సభకు బస్సులు వినియోగించుకొంటున్నందున ప్రజలు తమ ప్రయాణాలను మర్నాటికి వాయిదా వేసుకోవాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. త్వరలో తమిళనాడులో తమ పార్టీ నేతలు పర్యటించి అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలైన డీఎంకె, అన్నాడీఎంకె పార్టీల సంస్థాగత నిర్మాణ శైలి, ఆ పార్టీ విధివిధానాలు వగైరాలను అధ్యయనం చేసి వాటి తరహాలో టిఆర్ఎస్‌ పార్టీని కూడా బలోపేతం చేసుకొంటామని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.