
సిఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రికి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. ఈ పర్యటనలో ప్రధానంగా ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి వాటిని బట్టి యాదాద్రి పునః ప్రారంభ తేదీని ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇటీవల సిఎం కేసీఆర్ చిన జీయర్ స్వామిని కలిసి యాదాద్రిలో సుదర్శనయాగ నిర్వహణ గురించి చర్చించారు. కనుక రేపటి పర్యటనలో సుదర్శన యాగం ఎప్పుడు నిర్వహించేది కూడా ప్రకటించే అవకాశం ఉంది.
నిజానికి గత ఏడాది డిసెంబర్లోగానే ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి సుదర్శనయాగం చేయాలని సిఎం కేసీఆర్ భావించారు. కానీ కరోనా కారణంగా నిర్మాణపనులు ఆలస్యం అవడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు దాదాపుగా అన్ని పనులు పూర్తయినందున త్వరలోనే ఆలయాన్ని పునః ప్రారంభించి సుదర్శనయాగం నిర్వహించేందుకు సిఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఈ యాగానికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, వివిద రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులను సిఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు.