సంబంధిత వార్తలు

ఈనెల 30న హుజూరాబాద్ ఉపఎన్నిక జరుగబోతోంది. నవంబర్ 2న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. కనుక పోలింగ్ పూర్తయ్యే వరకు ఈ ఉపఎన్నికపై మీడియా సంస్థలు ఎటువంటి ఎగ్జిట్ సర్వేల ఫలితాలు ప్రకటించరాదని జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126 (ఏ) ప్రకారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాలకు ఇది వర్తిస్తుందని తెలిపారు.